అంతర శిశువు - 5 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, మార్చి 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు @ QLU సహస్రార పిరమిడ్ దివ్య శక్తి క్షేత్ర నిర్మాణంలో అందరూ భాగస్వాములు అయ్యేలా మరి అలానే మనలోని మన దివ్యత్వపు ఉనికి అయిన అంతర శిశువు (Inner Child) గురించిన జ్ఞానాన్నీ తెలుసుకునేలా రూపొందించిన ఉచిత వసతి సదుపాయాలతో కూడిన - విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం (Free Residential - Fund Raising Program)
బాధాకరమైన అనుభవాలను తప్పించుకోవటం కోసం, తనను తాను రక్షించుకోవటం కోసం ఇన్నర్ చైల్డ్ మన వ్యక్తిత్వం నుంచి వైదొలగుతుంది అయితే ఇది తాత్కాలికమే అనిపించినప్పటికీ ఎన్నటికీ పరిష్కరించబడకుండా ఉందిపోయింది భావోద్వేగ గాయాలు ఏ మాత్రం సాంత్వన, సంయమనం పొందని పరిస్థితుల వలన జీవితాంతం కొనసాగుతూ ఉంటాయి ఫలితంగా మన అంతర శిశువుతో అనుబంధాన్ని కోల్పోతాము
బాల్యంలో నిర్లక్ష్యం చేయబడినా, అందరిముందర అవమానించబడినా, కంటికి కనిపించని ఒత్తిడికి గురి అయినా, అతిగా ఆశించినా మన మనస్సులో ఆ చిన్ననాటి చేదు అనుభవాలను, గాయాలను మోస్తూ ఉంటాము మనం ఎదుర్కొన్న అనుభవాలు అన్నింటిని భావోద్వేగాలలో, శరీరంలో ఎప్పటికి దాచుకుంటాము
చిన్నతనంలో మనకు జరిగినవి మనలో చాలామందిని వేధిస్తూంటాయి, బాధిస్తూంటాయి అవే పెరిగి పెద్దయ్యాక మనస్పర్ధలకూ, సమస్యలకూ కారణం అవుతాయి
అచేతనామానసంతో అంతర శోధన, సాధన చేస్తున్నప్పుడు కాలం అనే పరిమితి మనకు వర్తించదు మనయొక్క ప్రస్తుత జ్ఞానవంతమైన, ప్రేమపూర్వకమైన భాగం మనలోని చిన్నారి అంతర శిశువును అక్కున చేర్చుకుని సహాయపడటానికి, ఊరడించి భరోసా ఇవ్వటానికి, అన్నిటినీ మించి జీవితంలో నూతనోత్తేజాన్ని, ఉల్లాసాన్నీ తీసుకురావటానికి అవకాశం ఉంటుంది
గాయపడిన అంతర శిశువును తిరిగి తెచ్చుకోవటం ద్వారా హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకోవటం ద్వారా మనపట్ల మనం మోసుకుంటూ వస్తున్న తెలిసీ తెలియని అపోహలు అన్నింటిని వెలికి తీసి నిజనిర్ధారణ చేసుకొని వాటిని పరివర్తన చెందటానికి ఆస్కారం ఉంటుంది
విధానం : ఇందులో పాల్గొంటున్నవారికి ప్రతి అంశం సోదాహరణంగా చక్కని ఇంట్రాక్టీవ్ సెషన్ల(interactive sessions)తో సహా వివరించబడుతుంది ప్రతి ఒక్కరికి వివిధ రకాల ధ్యాన ప్రక్రియలు, అభ్యాసాలతో పాటు సమూహం అందరికీ కూడా అత్యంత ఆవశ్యకమైన మార్గదర్శకాలు అందజేయబడుతాయి
లక్ష్యాలు : " ప్రతి శిశువునూ గౌరవించటం, అర్థం చేసుకోవటం మరియు విలువ ఇవ్వటం అనేది అత్యంత ఆవశ్యకం" - అలిస్ మిల్లర్
మీ చిన్నారి అంతర శిశువు ఆశిస్తున్న ప్రోత్సాహకరమైన శ్రద్ధనూ ఎలా అందించాలో తెలుసుకోవడం సమూహం యొక్క సహాయ సహకారాల మధ్య మీరు ఒంటరివాళ్ళు కాదని తెలుసుకోవడం, అనుభవాలు పంచుకుంటూ అందరితో కలిసిమెలిసి యాక్టివిటీస్(activities) లో పాల్గొనటం వలన భయాలను పోగొట్టుకుని అవ్యాజమైన ప్రేమ(unconditional love)తో జీవితాన్ని ఆస్వాదించే అద్భుతమైన స్వస్థతా ప్రక్రియలు తెలుసుకోవడం
ప్రయోజనాలు : మీ అంతరశిశువు నుంచి మిమ్మల్ని వేరు చేసిన ప్రతికూలమైన అంశాలను గురించి తెలుసుకుని వాటిని నయం చేసుకోవటం మొదలుపెట్టడం మీ అంతరశిశువుతో పునరానుసంధానం కావటం, సంపూర్ణంగా సమైక్యపరచుకోవటంలో నేర్పును పెంపొందించుకోవటం మీ అంతరశిశువుతో ఆటపాటలను, ఆనందించటాన్ని నేర్చుకోవటం అవ్యాజమైన ప్రేమ యొక్క పరమానందాన్ని తిరిగి పొందటం అదే మనందరి జీవిత పరమార్ధం
ఆత్మసాక్షాత్కారానికి ఆవశ్యకరమైన ఈ ఉత్తమ శిక్షణా శిబిరంలో చేరాలంటే అర్హతలు :
పాల్గొనేవారు గమనించవలసిన ముఖ్యమైన అంశాలు మరియు మీతో పాటుగా తీసుకురావాల్సినవి :
అంతర శిశువు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ లో చేరుటకు పాటించవలసిన మార్గదర్శకాలు(guidelines) :
కోర్సు ప్రారంభమయ్యే ఒక రోజు ముందు సాయంత్రం 4 గంటలలోపు మీరు క్వాంటం లైఫ్ యూనివర్శిటీ క్యాంపస్(వికారాబాద్) కు చేరుకోవాలి దయచేసి మీ టిక్కెట్లను తదనుగుణంగా బుక్ చేసుకోండి
* 2వ తేదీ మార్చి 2023 సాయంత్రం 4 గంటల లోపు క్యాంపస్‌కు చేరవలెను మీ తిరుగు ప్రయాణం టికెట్లను 7వ తేదీ మార్చి 2023 సాయంత్రం 2 గంటల తర్వాత బయలుదేరేలా బుక్ చేసుకోండి
* పైన తెలిపిన సమస్యలు ఉన్నవారు ఒకవేళ సరికాని విధంగా ప్రవేశం పొందినా QLU ప్రాంగణంలో అలాంటి శారీరక లేదా మానసిక సమస్యలు గుర్తించిన యెడల వారిని పంపించి వేయడం జరుగుతుంది అలాంటి వారు మన ఆఫీస్ నందు సంప్రదించి తగిన కౌన్సిలింగ్ లేదా మార్గదర్శకాలు పొందగలగడం ఉత్తమ మార్గం
ధృవీకరణ : ఈ అంతర శిశువు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌కు నేను ఇష్టపూర్వకంగా హాజరు అవుతున్నాను అనీ, ఆచార్యులు మరియు సేవ మైత్రేయుల అందరినీ గౌరవిస్తాను అనీ తెలియజేస్తున్నాను ఇదంతా నాయొక్క ధ్యానసాధన, స్వీయ స్వస్థత మరియు ఆధ్యాత్మిక పరిణితి కోసం అనీ, రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనేది నా స్వీయ పరివర్తన కోసమే అనీ నేను తెలుసుకున్నాను ఇంకా ఇది ఏవిధమైన చికిత్సా విధానంకు ప్రత్యామ్నాయం కాదని (లేదా) శిక్షకులుగా ఇచ్చే శిక్షణ కాదని తెలుసుకున్నాను అంతర శిశువు వంటివి స్వయంగా ఆయా విభాగాల్లో సంపూర్ణ నైపుణ్యం సాధించే ప్రత్యేక శిక్షణను పూర్తి చేసుకోకుండా ఇతరులపై ప్రయోగం చేయకూడదని అర్థం చేసుకున్నాను
వివరాలకు సంప్రదించండి : అంతర శిశువు 5 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కోసం రిజిస్టర్ చేసుకోబోయేముందు QLU టీం మెంబర్స్ ను సంప్రదించి మరింత అవగాహన పొందటం తప్పనిసరి అని గమనించాలి
వేదిక : (ప్రపోజ్డ్) క్వాంటం లైఫ్ యూనివర్శిటీ (QLU) Campus, నాగసాన్పల్లి గ్రామం, కోట్‌పల్లి మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ - 501106 ఫోన్: 040–42212566, 9849492098 (10am to 6pm) ఇ – మెయిల్: info@qluglobal.org వెబ్సైట్: www.qluglobal.org
* Cancellation మార్గదర్శకాలు :- ఏ కారణం చేతనైనా జనవరి 15వ తేదీ లోపు మీ రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్నచో వసతి కొరకు పంపిన విరాళాలు మాత్రమే తిరిగి ఇవ్వబడుతాయి మరియు క్రిస్టల్ డొనేషన్ కొరకు పంపిన విరాళాలు సహస్రార పిరమిడ్ నిర్మాణం కొరకు వినియోగించడం జరుగుతుంది- ప్రభుత్వం వారు కరోనా నిమిత్తం నిర్ణయించే నియమ నిబంధనలను అనుసరిస్తూ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది
పైన తెలిపిన మార్గదర్శకాలు అన్నీ పూర్తిగా అర్థం చేసుకున్నాకే నేను నా ఇష్టపూర్వకంగా అంగీకారం తెలుపుతున్నాను